“ఖైదీ 2” కి లింకప్ గా మరో క్రేజీ ప్లాన్ చేసిన లోకేష్.!

“ఖైదీ 2” కి లింకప్ గా మరో క్రేజీ ప్లాన్ చేసిన లోకేష్.!

Published on Dec 13, 2023 4:00 PM IST

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర కూడా పలు సినిమాటిక్ యూనివర్స్ లు మంచి ఊపందుకున్న సంగతి తెలిసిందే. మరి వీటిని కోలీవుడ్ యంగ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ పరిచయం చేయగా మూవీ లవర్స్ అయితే బాగా ఎగ్జైట్ అవుతున్నారు. దీనితో తన లైనప్ చాలా ఆసక్తిగా మారింది. ఇక తన లైనప్ లో అవైటెడ్ గా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సాలిడ్ సీక్వెల్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “ఖైదీ 2” అని చెప్పాలి.

అసలు తన సినిమాటిక్ యూనివర్స్ ని స్టార్ట్ చేసిన “ఖైదీ” సినిమా తోనే లోకేష్ తన కెరీర్ లో హిట్ అందుకున్నాడు. మరి కార్తీ హీరోగా నటించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ సీక్వెల్ ని తాను ఇంకా స్టార్ట్ చేయాల్సి ఉండగా ఈ సినిమా విషయంలో ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు బయటకి వచ్చింది. ఈ ఖైదీ అలాగే విక్రమ్ చిత్రాల్లో కీలక పాత్ర చేసిన నటుడు నరైన్ మాట్లాడుతూ ఓ ఊహించని అప్డేట్ ని రివీల్ చేసాడు.

తాను లోకేష్ కనగరాజ్ కలిసి ఒక 10 నిమిషాలు ఉండే షార్ట్ ఫిలిం ని ప్లాన్ చేస్తున్నామని ఇది కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి అలాగే ఖైదీ 2 కూడా లింకప్ ఉండేలా అయితే ఉంటుంది అని తెలిపాడు. దీనితో ఈ ఊహించని అప్డేట్ ఇప్పుడు అందరిలో మరింత ఆసక్తిగా మారింది. మరి ఈ షార్ట్ ఎప్పుడు వస్తుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు