ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఫస్ట్ ఎవర్ భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప ది రైజ్”. మొత్తం చిత్ర యూనిట్ కి పాన్ ఇండియన్ సినిమా ఇది. దీనితో ఆ మార్కెట్ కి తగ్గట్టు గానే భారీ లెవెల్లో చాలా గ్రాండ్ గా సినిమాని మేకర్స్ తీర్చి దిద్దుతున్నారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ని ఇచ్చారు.
ఏకంగా ఈ సినిమాలో ఓ సాంగ్ కి 1000 మంది డాన్సర్స్ ని రంగంలోకి దింపారట. వారితో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ కలిసి వేసే మాస్ స్టెప్స్ ఇంకో లెవెల్ మాస్ ని చూపిస్తాయని చిత్ర యూనిట్ చెబుతున్నారు. మరి విజువల్ గా ఈ గ్రాండ్ సాంగ్ ఎలా ఉంటుందో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఎలాంటి మాస్ నెంబర్ ని ఇచ్చాడో వేచి చూడాలి. ఇక ఈ భారీ సినిమాలో సునీల్, ఫహాద్ సహా అనసూయ లు కీలక పాత్రల్లో నటించగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.