గ్లోబల్ స్టార్, సూర్యతో 300 కోట్ల ప్రాజెక్ట్ ఆఫర్!

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న అవైటెడ్ చిత్రాల్లో అక్కినేని వారి యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా దర్శకుడు సాయి పల్లవి హీరోయిన్ గా యువ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం “తండేల్” కూడా ఒకటి. అయితే ఈ సినిమా దర్శకుడు ముందు చేసిన కార్తికేయ 2 పాన్ ఇండియా లెవెల్లో మంచి హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఈ హిట్ తర్వాత తనకి ఏకంగా 300 కోట్ల బడ్జెట్ తో సినిమా చేసే ఆఫర్ వచ్చినట్టుగా తను రివీల్ చేసాడు.

తండేల్ నిర్మాణంలో కీలకమైన దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ కార్తికేయ 2 చూసి అమితంగా ఇంప్రెస్ అయ్యారట. దీనితో 300 కోట్లకి పైగా బడ్జెట్ ఇస్తాను అని చెప్పి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేదా సూర్యలతో ఎలాంటి సబ్జెక్టు అయ్యినా సరే రెడీ చేయమని ఆఫర్ చేసినట్టుగా రివీల్ చేసాడు. అయితే ఆ సమయంలో మొదట తాను తండేల్ సబ్జెక్టు నాగ చైతన్యతో చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నానని ఈ సినిమా మొదలు పెట్టినట్టుగా తెలిపాడు. మరి ఈ 300 కోట్ల బడ్జెట్ సినిమా ఉంటుందో లేదో అనేది కాలమే నిర్ణయించాలి.

Exit mobile version