నందమూరి హీరోస్ లో మంచి ఇంటెన్సిటీ కలిగి ఉన్న ప్రముఖ హీరోస్ లో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఒకడు. మరి ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా సాలిడ్ కాన్సెప్ట్ లు తీసుకొని తాను వస్తున్నాడు. అలా ఇప్పుడు పలు ఆసక్తికర సినిమాలు తాను చేస్తుండగా వీటిలో తన కెరీర్ 21వ సినిమా కూడా ఒకటి. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న ఈ మాస్ ప్రాజెక్ట్ పై మంచి బజ్ ఆల్రెడీ నెలకొంది.
పైగా విజయశాంతి కూడా ఈ సినిమాలో నటిస్తుండడం మరో ప్రధాన ఆకర్షణ కాగా ఇప్పుడు ఈ సినిమా సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు వినిపిస్తుంది. ఈ సినిమాలో ఏకంగా 8 కోట్ల ఖర్చుతో ఒక యాక్షన్ సీక్వెన్స్ ని మేకర్స్ ప్లాన్ చేశారట. మొత్తం 1000 మంది ఆర్టిస్టులతో కళ్యాణ్ రామ్ పై భారీ క్లైమాక్స్ ఎపిసోడ్ ని మేకర్స్ ఇప్పుడు పూర్తి చేసినట్లు తెలుస్తుంది.
మొత్తం 30 రోజులు పాటుగా ఈ ఎపిసోడ్ ని మేకర్స్ షూట్ చేయగా ఈ సీక్వెన్స్ మొత్తాన్ని ఫైట్ మాస్టర్ రామకృష్ణ సారథ్యంలో తెరకెక్కించారు. అలాగే బ్రహ్మ కడలి అద్భుతమైన ఆర్ట్ వర్క్ ని ఈ సీన్ మొత్తానికి అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇలాంటి ఓ ఓ గ్రాండ్ సీక్వెన్స్ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా అశోక క్రియేషన్స్ తో కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నాడు.