వరుణ్ తేజ్ “మట్కా” కోసం భారీ ఖర్చుతో సెట్!?


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ప్రముఖ దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “మట్కా” కూడా ఒకటి. మరి ఈ చిత్రం కోసం మేకర్స్ భారీ ఖర్చు పెడుతుండగా ఒక వింటేజ్ గ్యాంగ్ స్టర్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కబోతుంది అని తెలుస్తుంది.

అయితే ఈ సినిమాకి చాలా కాలం గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ మళ్ళీ సెట్స్ లోకి అడుగు పెట్టాడు. ఈ సినిమా కోసం ఒక కొత్త మేకోవర్ లోకి మారిన వరుణ్ తేజ్ ఇప్పుడు కొన్ని కీలక సన్నివేశాల్లో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.

ఈ సినిమా విశాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తుండగా అప్పట్లో విశాఖ ఎలా ఉండేది అనే దానికి సంబంధించి ఓ భారీ సెట్టింగ్ కి భారీ ఖర్చుతో మేకర్స్ వేసారట. దీనికి గాను దాదాపు 15 కోట్ల మేర పెట్టారని వినిపిస్తుంది. మరి ఇంత ఖర్చు పెట్టి చేసిన సినిమా సెట్టింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version