మెలోడియస్ గా ఆకట్టుకుంటోన్న ‘భీమా’ నుండి ‘ఏదో ఏదో మాయ’ సాంగ్

గోపీచంద్ హీరోగా మాళవిక శర్మ, ప్రియా భవానిశంకర్ హీరోయిన్స్ గా కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ భీమా. ఈ మూవీలో గోపీచంద్ పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్ర చేస్తుండగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.

ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన భీమా నుండి నేడు ఏదో ఏదో మాయ అనే పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ మెలోడియస్ సాంగ్ కి రవి బస్రూర్ సూపర్ ట్యూన్ అందించగా అనురాగ్ కులకర్ణి గాత్రం, కళ్యాణ్ చక్రవతి రచన పాటని మరింతగా ఆకట్టుకునేలా చేసాయి. ప్రస్తుతం ఈ సాంగ్ అందరి నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి భీమా మూవీని మార్చి 8న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సాంగ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version