మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు పై ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి. యువ దర్శకుడు వంశీ తెరకెక్కించిన ఈ మూవీని అభిషేక్ అగర్వాల్ నిర్మించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న టైగర్ నాగేశ్వరరావు నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కూడా అలరించాయి.
ఇక తాజాగా ఈ మూవీ నుండి ఇచ్చేసుకుంటాలే అనే పల్లవితో సాగే మెలోడియస్ సాంగ్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సాంగ్ ని భాస్కరభట్ల రచించగా సింధూరి విశాల్ అద్భుతంగా పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళుతోంది. స్టూవర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ అక్టోబర్ 20న పలు భాషల ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి