‘వార్ 2’ పై ఫ్యాన్స్ లో కొత్త చర్చ

‘వార్ 2’ పై ఫ్యాన్స్ లో కొత్త చర్చ

Published on Dec 23, 2024 12:00 PM IST

తెలుగు సినిమాకి రూ.1000 కోట్లు కలెక్షన్స్ రావడం అంటే ఒకప్పుడు సాధ్యమా అనిపించేది. కానీ ప్రస్తుతం ఈ మార్క్ దాటడం కష్టమేమీ కాదు అని తేలిపోయింది. ఇప్పటికే ‘పుష్ప 2’ సినిమా రూ.1510 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ సినిమాకి నార్త్ లో కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏ సినిమా చాలా త్వరగా రూ.1000 కోట్ల మార్క్ ను అందుకుంటుందో అని నెటిజన్స్ లో చర్చ మొదలయ్యింది. ఈ క్రమంలో ప్రముఖంగా వినిపిస్తున్న సినిమా పేరు ‘వార్ 2’.

మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న ఈ ‘వార్ 2’ సినిమా పై నిజంగానే పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. సౌత్ లో ఎన్టీఆర్, నార్త్ లో హృతిక్ రోష‌న్‌ కారణంగా ఈ సినిమాకి ఎక్కడా లేని బజ్ ఉంది. కాబట్టి, హిందీలో ఆల్‌టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోందని అంచనాలు ఉన్నాయి. అలాగే, సౌత్ లో కూడా ముఖ్యంగా తెలుగులో కూడా ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి, చాలా త్వరగా రూ.1000 కోట్ల కలెక్షన్స్ అందుకునే సినిమాగా ‘వార్ 2’ నిలిచే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు