కీర్తి సురేష్ హిందీ సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది..


మన టాలీవుడ్ సహా సౌత్ సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ హీరోయిన్స్ లో కీర్తి సురేష్ కూడా ఒకరు. మరి కీర్తి హీరోయిన్ గా తెలుగు సహా తమిళ్, మలయాళ భాషల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే. మరి ఈ భాషలతో పాటుగా కీర్తి సురేష్ హిందీలో కూడా ఇప్పుడు తన మొదటి ప్రాజెక్ట్ ని చేస్తుంది. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) హీరోగా దర్శకుడు కలీస్ తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే “బేబీ జాన్” (Baby John).

మరి ఈ సినిమాని కోలీవుడ్ యంగ్ దర్శకుడు అట్లీ హిట్ చిత్రం “తేరి” కి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. అలాగే హిందీలో ఈ చిత్రాన్ని అట్లీ నిర్మాణం వహిస్తున్నాడు. అయితే ఇది వరకే ఈ చిత్రాన్ని మేకర్స్ మే 31 కి అలా ప్లాన్ చేశారు కానీ ఈ సినిమా అక్కడ నుంచి వాయిదా పడింది. అయితే లేటెస్ట్ గా వరుణ్ ధావన్ పై ఒక స్ట్రైకింగ్ పోస్టర్ రిలీజ్ చేసి ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 25 క్రిస్మస్ కానుకగా వస్తున్నట్టుగా రివీల్ చేశారు.

దీనితో కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూ అప్పటివరకు ఆగాల్సిందే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా అట్లీతో పాటుగా జియో స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version