ప్రభాస్ “రాజా సాబ్”..వారిలో సరికొత్త టెన్షన్.!

ప్రభాస్ “రాజా సాబ్”..వారిలో సరికొత్త టెన్షన్.!

Published on Jan 16, 2024 8:07 AM IST


రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “సలార్” తో మళ్లీ తాను ట్రాక్ లోకి రాగా ఈ చిత్రం తర్వాత తన రెబల్ ఫ్యాన్స్ కి మాత్రం తన నెక్స్ట్ సినిమాల విషయంలో కావాల్సినంత హై ని అయితే అందించాడు. ఇక దర్శకుడు మారుతీతో ప్రాజెక్ట్ “రాజా సాబ్” నుంచి వింటేజ్ ట్రీట్ ని గ్యారెంటీ చేస్తూ అదరగొట్టిన ప్రభాస్ తన ఫ్యాన్స్ కి ఈ సినిమాతో మంచి ట్రీట్ నే ప్రామిస్ చేస్తున్నాడు కానీ ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ కి మాత్రం మరో కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యింది.

మొదటగా ఈ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడే కాస్త నెగిటివ్ స్టార్ట్ అయ్యింది కానీ దర్శకుడు దాన్ని కంప్లీట్ ఛాలెంజ్ గా తీసుకొని అదే నెగిటివ్ గా మాట్లాడిన ఫ్యాన్స్ తో ఈ సినిమా కోసం వైట్ చేసేలా చేసాడు. ఇక ఇప్పుడు సరికొత్త టెన్షన్ ఏమిటంటే సంగీత దర్శకుడు థమన్ విషయంలో అని చెప్పాలి.

థమన్ గత కొన్నేళ్ల కితం సెన్సేషనల్ ఆల్బమ్స్ ని ఇచ్చాడు కానీ రీసెంట్ వర్క్స్ మాత్రం ఆడియెన్స్ కి అంతగా ఎక్కడం లేదు. దీనితో రాజా సాబ్ కి ఎలాంటి వర్క్ అందిస్తాడో అని ఫ్యాన్స్ ఎక్కడో చిన్న టెన్షన్ అయితే ఉంది. మరి దీనిని కూడా బ్రేక్ చేస్తూ థమన్ ఎలాంటి మ్యూజిక్ ఈ చిత్రానికి అందిస్తాడో చూడాలి. ఆల్రెడీ ప్రభాస్ కి సాహో, రాధే శ్యామ్ చిత్రాలకు తాను క్రేజీ స్కోర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు