“దేవర” కోసం నీటి లోపల పర్మినెంట్ పూల్.. రత్నవేలు ఇంట్రెస్టింగ్ పోస్ట్

ప్రస్తుతం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు ఎన్నో ఏళ్ళు తరబడి ఎదురు చూస్తున్నారు. మరి దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని నీటి నేపథ్యంలో ఒక పవర్ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించగా మరికొన్ని గంటల్లో బిగ్ స్క్రీన్స్ పై దేవర ఆగమనం జరగనుంది.

అయితే ఈ సినిమాని వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఎప్పటికపుడు ఇంట్రెస్టింగ్ అంశాలు షేర్ చేసుకుంటూ వస్తున్నారు. అలా ఈ సినిమాకి ఎంతో కష్టపడిన తన స్కూబా డైవర్స్ కోసం అలాగే నీటి లోపల ఒక సెపరేట్ పర్మనెంట్ పూల్ ని దేవర కోసం కట్టేసిన నిర్మాతలు సుధాకర్ మిక్కిలినేని అలాగే హరి గార్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని రత్నవేలు ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. దీనితో ఈ పోస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి.

Exit mobile version