వైరల్ అవుతున్న రానా-మిహికాల రొమాంటిక్ ఫోటో.

Published on Aug 6, 2020 8:12 pm IST


మరో రెండు రోజులలో రానా మరియు మిహికా బజాజ్ పెళ్లి బంధంతో ఒక్కటికానున్నారు. మూవీ మొఘల్ స్వర్గీయ రామానాయుడుగారి పెద్ద మనవడు రానా వివాహం కుటుంబ సభ్యులు ఘనంగా చేయనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా వైరస్ గురించి అనేక నిబంధనలు, నియమాలు మరియు జాగ్రత్తలు పెళ్లి వేడుకలో పాటించనున్నారు. టాలీవుడ్ నుండి అనేక మంది సెలెబ్రిటీలు ఈ పెళ్ళికి హాజరుకానున్నారు.

ఇప్పటికే రానా-మిహికా పెళ్ళికి హాజరయ్యే వారి లిస్ట్ సిద్ధం చేశారట. కరోనా ఆంక్షలు లేకుంటే రానా వివాహం దేశం మొత్తం చెప్పుకొనేలా జరిగేది. కాగా ఇక ఈ వివాహానికి హాజరుకావడానికి అవకాశం లేనివారికి వర్చువల్ రియాలిటీ లో చూడడానికి ప్రత్యేకమైన సెట్స్ పంపిస్తున్నారట. కాగా రానా మిహికాల ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెల్లబట్టలో రానా, డిజైనర్ వేర్ లో ఉన్న మిహికా బజాజ్ ల రొమాంటి పోజ్ ఆసక్తి రేపుతుంది.

సంబంధిత సమాచారం :

More