“దేవర” నుంచి అదిరిన పవర్ఫుల్ పోస్టర్.!

“దేవర” నుంచి అదిరిన పవర్ఫుల్ పోస్టర్.!

Published on Sep 17, 2024 2:00 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి సమయం దగ్గరకి వస్తున్న కొద్దీ మేకర్స్ కావాల్సినంత హైప్ ని అయితే ఎక్కించేస్తున్నారు. ఇలా ఇప్పుడు దేవరపై కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ అయితే ఆడియెన్స్ అటెన్షన్ ని అలా పట్టుకుంటున్నాయి. ఇలా లేటెస్ట్ గా దేవర నుంచి వచ్చిన ఒక కొత్త పోస్టర్ అదిరింది అని చెప్పాలి.

దేవర రిలీజ్ కి ఇంకా 10 రోజుల గ్యాప్ ఉంది అన్నట్టుగా దానిని సూచించే ఎక్స్ (X) రూపంలో డిజైన్ చేసిన పోస్టర్ వైరల్ గా మారింది. మరి ఇందులో యంగ్ ఎన్టీఆర్ కత్తి పట్టుకొని కనిపిస్తున్న విజువల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. దీనితో ఈ కొత్త పోస్టర్ చూసిన ఫ్యాన్స్ మాత్రం బాగా ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ భారీ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. అలాగే అనిరుద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు