గోపీచంద్ హీరోగా మాళవిక శర్మ, ప్రియా భవాని శంకర్ హీరోయిన్స్ గా యువ దర్శకుడి ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ భీమా. ఈ మూవీకి కెజిఎఫ్ సినిమాల ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ దీనిని భారీగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే భీమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ఫస్ట్ సాంగ్ ఆకట్టుకోగా నేడు ఈ మూవీ నుండి గల్లీ సౌండుల్లో అనే పల్లవితో సాగె మాస్ బీట్ పవర్ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. సంగీత దర్శకుడు రవి అందించిన పవర్ఫుల్ బీట్ కి సంతోష్ వెంకీ స్వరం, అలానే రవి బస్రూర్ తో కలిసి సంతోష్ వెంకీ అందించిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ రాబడుతోంది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి మార్చి 8న విడుదల చేయనున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి