కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం “ఆకాశం నీ హద్దురా” హిట్టవ్వాలని తమిళ్ మరియు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో కోరుకున్నారు. మోస్ట్ లవబుల్ హీరో అయినటువంటి సూర్య సరైన హిట్ లేక సతమతమవుతున్న సందర్భంలో రెండు భాషల్లోనూ ఓటిటి విడుదలతో వచ్చిన ఈ చిత్రం.
అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఒక్క థియేటర్ లో విడుదల కాలేదు అన్న వెలితి తప్పితే ఈ సినిమాను ఎంజాయ్ చెయ్యకుండా ఉండని వారు ఉండరు. సుధా కొంగర తెరకెక్కించిన ఈ ఎమోషనల్ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీ ఇప్పుడు మరో అరుదైన ఘనతను దక్కించుకుంది.
హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసేషియన్ కు చెందిన 78వ గోల్డెన్ గోల్డ్ అవార్డ్స్ లో ఈ చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ ను వచ్చే జనవరిలో చెయ్యడానికి ఎంచుకోబడింది. ఈ ప్రౌడ్ మూమెంట్ తో ఇది మన ఇండియన్ సినిమాకు కూడా గర్వకారణంగా నిలిచింది అని సూర్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.