ప్రభాస్ మూవీ కోసం ఆస్కార్ విన్నర్?

Published on Jul 16, 2020 8:32 pm IST

ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్ పై ఇంత వరకు స్పస్టత లేదు. ఈనెల 10న విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో కూడా చిత్ర యూనిట్ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. దీనితో ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ పై అనేక ఉహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. అలాగే సాహో చిత్రం మాదిరి రాధే శ్యామ్ మూవీకి కూడా మల్టిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేసే అవకాశం కలదని కూడా అంటున్నారు. కాగా రాధే శ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ పనిచేయనున్నారని మరో వాదన తెరపైకి వచ్చింది.

ఇప్పటికే ఏ ఆర్ రెహమాన్ తో చిత్ర దర్శక నిర్మాతలు చర్చలు జరిపారని, ఆయన కూడా మూవీ చేయడానికి సుముఖత చూపారని కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలలో నిజం ఎంతో తెలియాలంటే…మరికొద్ది రోజులు ఆగాల్సిందే. దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More