“విశ్వంభర” టీజర్ కి రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్.!

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన భారీ విజువల్ ట్రీట్ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాపై మెగా అభిమానులు స్పెషల్ గా ఎదురు చూస్తున్నారు.

చిరు నుంచి స్ట్రైట్ సినిమా అందులో ఫాంటసీ జానర్ కావడంతో చాలా ఎగ్జైట్ అవుతున్నారు. మరో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ దసరా కానుకగా సాలిడ్ టీజర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ పై కొంచెం మిక్స్డ్ టాక్ తో కూడా ఊహించని లెవెల్ రెస్పాన్స్ అయితే యూట్యూబ్ లో అందుకుంది.

మరి మొత్తం 24 గంటల్లో ఏకంగా 23 మిలియన్ కి పైగా వ్యూస్ ని ఈ టీజర్ అందుకుంది. దీనితో మన టాలీవుడ్ లో ఒక రికార్డు బ్రేకింగ్ టీజర్ గా ఇది నిలిచింది అని చెప్పాలి. పలు పాన్ ఇండియా టీజర్స్ సైతం ఈ మధ్యలో ఇలాంటి రెస్పాన్స్ ని అందుకోలేదు. మరి కరెక్ట్ గా ప్లాన్ చేసి సినిమాని విడుదల చేస్తే మరోసారి మెగాస్టార్ తన స్టామినా చూపిస్తారని చెప్పడంలో సందేహం లేదు.

Exit mobile version