Devara: నైజాంలో “దేవర”తో కళ్ళు చెదిరే ఓపెనింగ్స్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి చాలా కాలం తర్వాత థియేటర్స్ లోకి వచ్చిన సోలో చిత్రమే “దేవర”. మరి దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ చేసిన రెండో సినిమా ఇది కాగా సంచలన అంచనాలు నడుమ ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో అయితే రిలీజ్ కి వచ్చింది. యూఎస్ మార్కెట్ సహా ఇండియన్ మార్కెట్ లో కూడా రికార్డు ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం మన తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించినట్టుగా తెలుస్తుంది.

ముఖ్యంగా నైజాంలో అయితే దేవర కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ ని నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. పి ఆర్ నంబర్స్ ప్రకారం దేవర ఏకంగా 19.32 కోట్ల వసూళ్లు అందుకొని ఆల్ టైం టాప్ 2 లో నిలిచింది. మరి మొదటి స్థానంలో ఎన్టీఆర్ కూడా భాగం అయినటువంటి RRR సినిమా నిలిచింది. ఇలా మొత్తానికి అయితే దేవర మొదటి రోజు రికార్డు ఓపెనింగ్స్ సాధించాడని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.

Exit mobile version