ఈ స్వాతంత్ర దినోత్సవ కానుకగా అలాగే లాంగ్ వీకెండ్ నేపథ్యంలో రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలు వచ్చాయి. కానీ వాటిలో అన్నటికంటే ఓ క్రేజీ సీక్వెల్ సినిమా మాత్రమే హవా చూపిస్తుంది అని చెప్పాలి. ఆ సినిమానే హారర్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం “స్త్రీ 2”. టాలెంటెడ్ నటీనటులు రాజ్ కుమార్ రావు అలాగే శ్రద్దా కపూర్ ఇంకా పంకజ్ త్రిపాఠి లాంటి నటులు ఈ చిత్రంలో నటించగా దర్శకుడు అమర్ కౌశిక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
అయితే పార్ట్ 1 పెద్ద హిట్ కాగా ఇప్పుడు పార్ట్ 2 పై భారీ హైప్ సెట్టయ్యింది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్ హిందీలో నమోదు అయ్యాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రానికి డే 2 భారీ బుకింగ్స్ బుక్ మై షో లో నమోదు అయ్యినట్టు తెలుస్తుంది. మరి రెండో రోజుకి ఈ సినిమా ఏకంగా 7 లక్షల 39 వేలకి పైగా బుకింగ్స్ ని నమోదు చేసుకుంది. మరి ఇదైతే ఈ మధ్య కాలంలో కల్కి 2898 ఎడి (Kalki 2898 AD) తర్వాత రికార్డు మొత్తమే అని చెప్పాలి. మొత్తానికి అయితే ఈ సినిమా హవా ఇలా ఉంది. ఇక ఎక్కడ ఆగుతుందో చూడాలి.