మన టాలీవుడ్ సినిమా లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవికి తన మార్క్ స్ట్రైట్ సినిమా హిట్ పడితే ఎలా ఉంటుందో “వాల్తేరు వీరయ్య” తో చూపించారు. మరి ఈ చిత్రం తర్వాత చేసిన రీమేక్ “భోళా శంకర్” డిజాస్టర్ అయినప్పటికీ మళ్ళీ తాను ఓ స్ట్రైట్ సినిమా చేస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మళ్ళీ తన భారీ ప్రాజెక్ట్ “విశ్వంభర” చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.
యంగ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చిరంజీవి నుంచి చాలా కాలం తర్వాత ఓ ఫాంటసీ సినిమాకి అలాగే స్ట్రైట్ సినిమాకి ఎంత క్రేజ్ ఉంటుందో చూపిస్తుంది. ఇలా విశ్వంభర ఇప్పుడు వరల్డ్ వైడ్ రికార్డు బిజినెస్ ని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మెగాస్టార్ కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్ ని తన పాన్ ఇండియా చిత్రం “సైరా నరసింహారెడ్డి” చేసింది.
కానీ ఈ చిత్రం తర్వాత అందులోని భోళా శంకర్ లాంటి ఫలితం తర్వాత కూడా హైయెస్ట్ బిజినెస్ ని విశ్వంభర చేస్తున్నట్టుగా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే ఈజీగా 100 కోట్లకి పైగా బిజినెస్ ని విశ్వంభర చేస్తుందట. అలాగే పలు పాన్ ఇండియా సినిమాలకి ధీటుగా మెగాస్టార్ తన సత్తా చూపిస్తున్నారని చెప్పాలి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో వేచి చూడాలి.