మాస్ మహరాజ్ “ధమాకా” నుంచి సాలిడ్ అప్డేట్ రెడీ..!

Published on Oct 5, 2022 7:00 am IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్ గా ఎంటర్తైనింగ్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం “ధమాకా” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం నుంచి ఆల్రెడీ వచ్చిన సాలిడ్ అప్డేట్స్ మంచి రెస్పాన్స్ అందుకోగా మేకర్స్ సినిమా పై మరిన్ని అదిరే అప్డేట్స్ ని అయితే సిద్ధం చేస్తున్నారు.

మరి అలా లేటెస్ట్ గా అయితే ఓ బ్లాస్టింగ్ అప్డేట్ రాబోతున్నట్టుగా లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు. ఇదొక బేస్ లు బడ్డలయ్యిపోయే మాస్ అప్డేట్ అంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి అంతలా ఎగ్జైట్ చేస్తున్న ఆ అప్డేట్ ఏంటో వేచి చూడాలి. వీరు చెప్తున్న దాని ప్రకారం అయితే సాంగ్ కోసమే అన్నట్టు అర్థం అవుతుంది. మరి అదేంటో చూడాలి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :