మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” టాలీవుడ్ లో రికార్డు బ్రేకింగ్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇపుడు ఉన్న యువ స్టార్ హీరోస్ లోనే కాకుండా మన సీనియర్ హీరోస్ లో కూడా భారీ వసూళ్లు అందుకున్న సినిమాగా వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది.
ఇక ఈ సినిమా సక్సెస్ తర్వాత తన నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ లు ఉంటాయి అనేది సస్పెన్స్ గానే ఉంది కానీ ఓ సాలిడ్ ట్రీట్ పై ఇపుడు ఒక క్లారిటీ రాబోతుంది అని చెప్పాలి. వెంకీ మామ నుంచి నెక్స్ట్ సినిమా కాదు కానీ తన అవైటెడ్ ఓటిటి సిరీస్ సీక్వెల్ రానా నాయుడు 2 పై క్లారిటీ ఈ ఫిబ్రవరి 3న నెట్ ఫ్లిక్స్ నుంచి రానుంది అని తెలుస్తుంది.
లేటెస్ట్ గా నెట్ ఫ్లిక్స్ వారు అనేకమంది సినీ తారలతో మీరు ఫిబ్రవరి 3 కోసం ఇంకా సిద్ధంగా లేరు అంటూ ఓ పోస్ట్ కొన్ని అనౌన్సమెంట్ లని సిద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. మరి ఇలా వెంకీ మామ నుంచి కూడా రాగా ఆరోజున రానా నాయుడు 2 పై ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
View this post on Instagram