సింహం లాంటి మహేష్.. “ముఫాసా” నుంచి అదిరిపోయిన పోస్టర్..

సింహం లాంటి మహేష్.. “ముఫాసా” నుంచి అదిరిపోయిన పోస్టర్..

Published on Dec 2, 2024 12:00 AM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “గుంటూరు కారం” తర్వాత తన నుంచి హీరోగా మరో సినిమా ఇప్పట్లో లేదని అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళితో మహేష్ డైరెక్ట్ పాన్ వరల్డ్ సినిమా లోకి ఎంటర్ కానున్నారు. అయితే ఈ గ్యాప్ లో రీ రిలీజ్ లతో ఫ్యాన్స్ సరిపెట్టుకుంటున్నారు.

కానీ తన నుంచి మాత్రం తన ప్రెజెన్స్ తో రాబోతున్న కొత్త సినిమానే “ముఫాసా”. హాలీవుడ్ సెన్సేషనల్ హిట్ లయన్ కింగ్ ఫ్రాంచైజ్ లో వస్తున్న సినిమా ఇది కాగా దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలో మెయిన్ లీడ్ సింహానికి మహేష్ చేత ప్రముఖ సంస్థ వాల్ట్ డిస్నీ వారు డబ్బింగ్ చెప్పించుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇక ఈ సినిమా రిలీజ్ కి దగ్గరకి వస్తున్న తరుణంలో ఇపుడు మేకర్స్ నుంచి మహేష్ తో సాలిడ్ పోస్టర్ బయటకి వచ్చింది. మరి తమ సింహం ముఫాసా పక్కనే మహేష్ తో కలిపి విడుదల చేసిన పోస్టర్ ఇపుడు ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. తన డబ్బింగ్ ఇప్పటికే ట్రైలర్ లో ఎంతో అలరించగా ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు