గ్లోబల్ స్టార్ పై అదిరిపోయే పోస్టర్ తో “గేమ్ ఛేంజర్” రెండో సాంగ్ ప్రోమో డేట్ వచ్చేసింది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ప్రస్తుతం అయితే సినిమా రెండో సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు.

మరి ఈ సాంగ్ గా రా మచ్చా మచ్చా అంటూ సాగే సాంగ్ ని ఉదయం అనౌన్స్ చేశారు. మరి లేటెస్ట్ గా అయితే ఈ సాంగ్ తాలూకా పోస్టర్స్ ని వదిలారు. మరి ఇందులో చరణ్ పై గ్రాండ్ సెలబ్రేషన్స్ సాంగ్ లా చరణ్ కూడా మంచి క్లాస్ లుక్స్ లో అదిరేలా కనిపిస్తున్నాడు. మరి తెలుగు సహా తమిళ్ మరియు హిందీ భాషల్లో ఈ సాంగ్ ప్రోమో ని ఈ సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టుగా దీనితో రివీల్ చేసేసారు.

మరి థమన్ ఈ సాంగ్ కి ఎలాంటి బీట్స్ ని అందించాడో వేచి చూడాలి. ఇక ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించగా శ్రీకాంత్, సునీల్, రాజీవ్ కనకాల తదితరులు నటించారు. అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version