“తండేల్”లో సర్ప్రైజ్ క్యామియోపై క్లారిటీ ఇదే!

“తండేల్”లో సర్ప్రైజ్ క్యామియోపై క్లారిటీ ఇదే!

Published on Feb 1, 2025 12:05 PM IST

అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా యువ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే “తండేల్”. మరి పూర్తిగా ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో నాగ చైతన్య చాలా కొత్తగా కనిపించనున్నాడు. అయితే ఇపుడు సాలిడ్ ప్రమోషన్స్ ని ఈ చిత్ర యూనిట్ చేస్తుండగా లేటెస్ట్ గా నార్త్ లో కూడా ప్రమోషన్స్ శరవేగం జరుగుతున్నాయి.

అయితే దీనితో తండేల్ లో ఓ సర్ప్రైజ్ క్యామియో ఉందని కొన్ని రూమర్స్ అయితే హిందీ సినీ వర్గాల్లో కూడా వైరల్ అవుతున్నాయి. మరి ఆ సర్ప్రైజ్ క్యామియో ఎవరో కూడా కాదు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కనిపించనున్నట్టుగా నార్త్ సోషల్ మీడియాలో ఇపుడు చెబుతున్నారు. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. గతంలో నాగ చైతన్య అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చడ్డా”లో గెస్ట్ రోల్ చేసాడు కానీ అమీర్ తండేల్ లో లేరని తెలుస్తుంది. సో ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు