మన ఇండియన్ ఇండియన్ టాప్ దర్శకుడు ఇప్పుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మన తెలుగు దర్శకుడు జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి అనే చెప్పాలి. మరి తన సెన్సేషనల్ ఫిల్మోగ్రఫీతో ఒక్క తెలుగు సినిమానే కాకుండా మొత్తం భారతీయ సినిమా గతినే ప్రపంచ వ్యాప్తంగా తిప్పిన దర్శకునిగా రాజమౌళి నిలిచాడు.
తన ఎపిక్ వండర్స్ “బాహుబలి”, “రౌద్రం రణం రుధిరం” చిత్రాలతో ప్రపంచ సినిమా దగ్గర తెలుగు సినిమా, భారతీయ సినిమా సత్తా చాటి తాను కూడా గ్లోబల్ దర్శకుడు అయిపోయారు. మరి తనపై దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఓ ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ “మోడ్రన్ మాస్టర్స్: ఎస్ ఎస్ రాజమౌళి” అంటూ కొన్ని రోజులు కితం అనౌన్స్ చేశారు.
మరి దీనిపై లేటెస్ట్ గా ట్రైలర్ ని నెట్ ఫ్లిక్స్ వారు రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ మాత్రం సర్ప్రైజింగ్ గా ఉందని చెప్పాలి. రాజమౌళి పై కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తనతో వర్క్ చేసిన హీరోలు రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ లు పంచుకున్న విశేషాలు. రాజమౌళి ఎంత పర్ఫెక్ట్ గా సినిమాలు చేస్తారు అనే అంశాలు ఈ ట్రైలర్ లో అద్భుతంగా చూపించారు.
అంతే కాకుండా ఈ ట్రైలర్ లో హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమరూన్ కూడా రాజమౌళి కోసం ప్రత్యేకంగా ఈ డాక్యూమెంటరీలో మాట్లాడ్డం ఊహించనిది అని చెప్పాలి. ఇక ఈ డాక్యూమెంటరీ అయితే ఈ ఆగస్ట్ 2న స్ట్రీమింగ్ కి రాబోతుంది.