ఆపద్బాంధవుడు చిరంజీవి.. ఫిష్ వెంకట్ విషయంలో ఉదారత చాటుకున్న మెగాస్టార్

ఆపద్బాంధవుడు చిరంజీవి.. ఫిష్ వెంకట్ విషయంలో ఉదారత చాటుకున్న మెగాస్టార్

Published on Sep 10, 2024 9:01 AM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై మాత్రమే కాకుండా బయట కూడా ఒక నిజమైన మెగాస్టార్ అని తెలిసిందే. సాయం అని అడిగిన వారికి అడగని వారికి మినిమం తన దృష్టికి వచ్చినా కూడా స్పందించే విశాల హృదయం మెగాస్టార్ సొంతం. అందుకే తన అభిమానులు ఇన్నేలైన మెగాస్టార్ కోసం ఎంతో గర్వంగా చెప్పుకుంటారు.

అయితే మెగాస్టార్ ఈ కొన్నేళ్లలో ఇండస్ట్రీకి చెందిన చాలా మంది నటులకి అలాగే మీడియా వారికి కూడా ఎంతో సాయం అందించారు. మరి తాజాగా అయితే ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కి కూడా సాయం అందించిన విషయం బయటకి వచ్చింది. గత కొన్నాళ్ల నుంచి ఫిష్ వెంకట్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం మెగాస్టార్ దృష్టికి వచ్చింది.

దీనితో వెంటనే చిరు స్పందించి ఫిష్ వెంకట్ కి కావాల్సిన వైద్యం అపోలో హాస్పిటల్స్ తరపున అందిస్తానని చెప్పారట. అలా చెప్పి చేర్చిన తర్వాత అతని కోసం అతని ఆరోగ్యం కోసం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారట. ఇలా ఆపదలో ఉన్నవారి పాలిట మెగాస్టార్ మరోసారి ఆపద్బాంధవుడిగా కనిపించారని చెప్పాలి. దీనితో చిరు విషయంలో మెగా అభిమానులు మరోసారి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు