“లియో” ఓటిటి రిలీజ్ కోసం చూస్తున్న వారికి ట్విస్ట్.!

“లియో” ఓటిటి రిలీజ్ కోసం చూస్తున్న వారికి ట్విస్ట్.!

Published on Nov 16, 2023 8:00 PM IST


ఇళయ దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “లియో”. మరి తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ చిత్రం రిలీజ్ కి రాగా విజయ్ మరియు లోకేష్ ల కెరీర్ లోనే బిగ్గెస్ట్ హైప్ తో వచ్చిన సినిమాగా ఇది నిలిచింది. మరి ఈ చిత్రం రిలీజ్ తర్వాత ఓటిటి రిలీజ్ కి కూడా ఎంతో సమయం పట్టదు అని కన్ఫర్మ్ అయ్యింది.

రిలీజ్ అయ్యిన జస్ట్ నాలుగు వారాల్లోనే వస్తుంది అని అప్పుడే టాక్ వచ్చింది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నవంబర్ రిలీజ్ లిస్ట్ ని నెట్ ఫ్లిక్స్ రివీల్ చేయగా ఇందులో విజయ్ “లియో” రిలీజ్ అయితే ఎక్కడా లేదు. దీనితో నవంబర్ లో ఓటిటి రిలీజ్ కోసం చూస్తున వారికి ఇది ట్విస్ట్ అనే చెప్పాలి. మరి సడెన్ గా ఏమన్నా ట్విస్ట్ ఇస్తారేమో చూడాలి.
https://www.instagram.com/p/Czstb4nsWyf/?img_index=1

సంబంధిత సమాచారం

తాజా వార్తలు