షూటింగ్ ముగించుకున్న ‘ష‌ణ్ముఖ‌’

షూటింగ్ ముగించుకున్న ‘ష‌ణ్ముఖ‌’

Published on Jun 25, 2024 8:00 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ త‌న‌దైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తాడ‌ని ఆది కి ఇండ‌స్ట్రీలో పేరుంది. అయితే, కొంత‌కాలంగా ఆయ‌న న‌టిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోతున్నాయి. ఈ క్ర‌మంలో ఆది త‌న కొత్త సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు.

ష‌ణ్ముగం స‌ప్పాని డైరెక్ట్ చేస్తున్న ‘ష‌ణ్ముఖ’ అనే సినిమాలో ఆది సాయి కుమార్ హీరోగా న‌టిస్తున్నారు. ఈ సినిమా ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాలో అందాల భామ అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ పూర్త‌యిన‌ట్లుగా చిత్ర యూనిట్ తాజాగా వెల్ల‌డించింది.

ఈ సినిమా క‌థ చాలా కొత్తగా ఉంటుంద‌ని, ప్రేక్ష‌కుల‌ను ఖ‌చ్చితంగా ఆకట్టుకుంటుంద‌ని చిత్ర యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ‘కేజీఎఫ్’ చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు ర‌వి బ‌స్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వ‌ర‌లోనే అనౌన్స్ చేస్తామ‌ని మేక‌ర్స్ వెల్ల‌డించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు