ఆది సాయి కుమార్ ‘శంబాల’ న్యూ ఇయర్ ట్రీట్

ఆది సాయి కుమార్ ‘శంబాల’ న్యూ ఇయర్ ట్రీట్

Published on Jan 1, 2025 5:26 PM IST

Aadi Saikumar Shambhala special poster

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ ప్రస్తుతం ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. మరి తనకి హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా కొత్త కాన్సెప్ట్ లని చేయడంలో తాను మాత్రం ఆగడం లేదు. అలా తాను స్టార్ట్ చేసిన మరో ఇంట్రెస్టింగ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సినిమానే “శంబాల”. A (యాడ్ ఇన్ఫినిటమ్) అనే డిఫరెంట్ మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యుగంధర్ ముని ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. తన తొలి సినిమా తరహాలోనే ‘శంబాల’ను కూడా ఓ డిఫరెంట్ వరల్డ్‌లో డిఫరెంట్ టోన్‌లో రూపొందిస్తున్నారట.

న్యూ ఇయర్ స్పెషల్‌గా వదిలిన స్పెషల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ పోస్టర్‌లో చూపించిన ఆ పొలం.. ఆ దిష్టి బొమ్మ.. ఆకాశం నుంచి భూమ్మీదకు వస్తున్న అగ్ని కణం ఇలా అన్నీ కూడా కథ మీద అంచనాలు పెంచేలా ఉన్నాయి.
షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ వంటి ప్రముఖ నటులు కూడా ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు