‘ఆహా’ స్పోర్ట్స్ డ్రామాకు అదిరిపోయే రెస్పాన్స్!

ఇంద్రజిత్ సుకుమారన్, మనోజ్ కె. జయన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘ఆహా’. ఈ చిత్రానికి బిబిన్ పాల్ శామ్యూల్ దర్శకత్వం వహించారు. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా అందుబాటులోకి తీసుకొచ్చింది.

Zsa Zsa ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రేమ్ అబ్రహం నిర్మించిన ఈ చిత్రానికి సయనోరా ఫిలిప్, షియాద్ కబీర్ సంగీతం అందించారు. 1980, 1990లలో బాగా ప్రాచుర్యం పొందిన టగ్ ఆఫ్ వార్ టీమ్ నుండి ప్రేరణ పొంది ఈ సినిమాను రూపొందించారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి ప్రసంశలు అందుతున్నాయి.

తాజాగా ఈ చిత్రం భవానీ మీడియా ద్వారా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అద్భుతమైన రెస్పాన్స్‌తో ఇది ఓటీటీలో దూసుకుపోతోంది. దీంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తుంది.

Exit mobile version