ఆకాష్ పూరి తో ప్రభాస్ రీల్…సోషల్ మీడియా లో వైరల్!

ఆకాష్ పూరి తో ప్రభాస్ రీల్…సోషల్ మీడియా లో వైరల్!

Published on Oct 25, 2021 7:42 PM IST


ఆకాష్ పూరి హీరోగా అనీల్ పాదురి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రొమాంటిక్. ఈ చిత్రం ను అక్టోబర్ 29 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను సైతం వేగవంతం చేయడం జరిగింది. ఈ చిత్రం కి సంబంధించిన మరొక ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్ లో పుట్టింది పడుకోడానికి కాదు, పోయాక పడుకో బే అంటూ వచ్చిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.

ఇదే డైలాగ్ ను ఆకాష్ పూరి తో ప్రభాస్ చెప్పడం తో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ చిత్రం నుండి ఏదైనా డైలాగ్ లేక పాట కి సంబంధించిన రీల్ ను చేసి రొమాంటిక్ రీల్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేసిన వారికి బహుమతుల తో పాటుగా, ప్రీమియర్ టికెట్స్ గెలుచుకునే అవకాశం అంటూ ప్రమోషన్స్ చేస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు పూరి జగన్నాథ్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు