Aamir Khan: చిరుపై అమీర్ ఖాన్ క్రేజీ స్టేట్మెంట్ వైరల్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం భారీ చిత్రం “విశ్వంభర” చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ గ్యాప్ లో ఇంకో ఊహించని వరల్డ్ రికార్డు అది కూడా తన డాన్స్ విషయంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నారన్న వార్త మరింత ఎగ్జైట్ చేసింది. అయితే ఈ అవార్డు వేడుకకి గాను బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ అమీర్ ఖాన్ కూడా హాజరయ్యి చిరంజీవికి గిన్నీస్ వరల్డ్ రికార్డు పురస్కారాన్ని అందించారు.

అయితే ఈ సందర్భంలో అమీర్ ఖాన్ చేసిన స్టేట్మెంట్ వైరల్ గా మారింది. చిరంజీవి గారు ఈ ఈవెంట్ కోసం మిగతా ఎవరినీ అడగకుండా నన్నే ఎందుకు అడిగారో మొదట అర్ధం కాలేదని అయితే చిరంజీవి గారు నన్ను అడగాల్సిన పనిలేదు మీరు నాకు ఆర్డర్ వేసినా తప్పకుండా వస్తానని అమీర్ లాంటి స్టార్ హీరో చెప్పడం మెగాస్టార్ రేంజ్ బాలీవుడ్ హీరోస్ లో ఏపాటిదో మనం అర్ధం చేసుకోవచ్చు. దీనితో చిరు విషయంలో అమీర్ ఖాన్ స్టేట్మెంట్ వైరల్ గా మారింది.

Exit mobile version