ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేస్తూ తన సత్తా చాటుతోంది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరుకి సౌత్, నార్త్ అంటూ తేడా లేకుండా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కళ్లు చెదిరే వసూళ్లను రాబడుతూ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తాండవం చేస్తోంది.
ఇప్పటికే వరల్డ్‌వైడ్‌గా ‘పుష్ప-2’ ఏకంగా రూ.1760 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. కేవలం 25 రోజుల్లోనే ఈ మార్క్‌ను అందుకున్న చిత్రంగా ‘పుష్ప-2’ నిలిచింది. దీంతో ఈ సినిమా సాధిస్తున్న బిగ్గెస్ట్ సక్సె్స్‌పై బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తాజాగా స్పందించాడు. ‘పుష్ప-2 భారీ విజయం సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సినిమా మున్ముందు మరింత విజయాన్ని అందుకోవాలని కోరుతున్నా..’ అంటూ అమీర్ ఖాన్ తన నిర్మాణ సంస్థ నుంచి ట్వీట్ చేశారు.
దీనికి ‘పుష్ప-2’ టీమ్ ధన్యవాదాలు తెలిపింది. ఇక ఇండియన్ సినీ చరిత్రలో అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ మూవీ అత్యధిక వసూళ్లతో ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా, ‘బాహుబలి-2’ టాప్ 2లో నిలిచింది. ఇప్పుడు ‘పుష్ప-2’ 3వ స్థానంలో ఉండటంతో త్వరలోనే ఈ మూవీ టాప్ స్థానాన్ని చేరుకోవడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.
Huge congratulations from AKP to the entire team of PUSHPA 2: THE RULE ???????? for the blockbuster success of the film!
Wishing you continued success onwards and upwards.
Love.
Team AKP@mythriofficial @aryasukku @alluarjun @iamRashmika #FahadhFaasil— Aamir Khan Productions (@AKPPL_Official) December 31, 2024