7 రోజుల్లో 9 కోట్లతో “ఆయ్”

7 రోజుల్లో 9 కోట్లతో “ఆయ్”

Published on Aug 22, 2024 9:00 PM IST

నార్నే నితిన్ మరియు నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఆయ్. ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రిలీజైన తొలి రోజు నుండి సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. చిన్న సినిమా అయినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ ను కనబరుస్తోంది. ఈ చిత్రం 7 రోజుల్లో 9.25 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఇది గొప్ప విషయం అని చెప్పాలి.

GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు. అంజి కే. మణిపుత్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రామ్ మిరియాల సంగీతం అందించాడు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు