బాక్సాఫీస్ వద్ద 10 కోట్లతో దూసుకు పోతున్న “ఆయ్”


కంటెంట్ బాగుంటే చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇటీవల పెద్ద చిత్రాలతో రిలీజైన చిన్న చిత్రం ఆయ్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా 9.25 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టగా, రెండో వారం కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. 8 రోజుల్లో 10.20 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, సెకండ్ వీక్ కూడా మంచి హోల్డ్ ను కనబరిచి, బాక్సాఫీస్ వద్ద మరింత వసూళ్లను రాబట్టడం ఖాయం. నార్నే నవీన్, నయన్ సారిక లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కి అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించాడు. రామ్ మిరియాల సంగీతం అందించాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకులు గా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మించారు.

Exit mobile version