“ఆయ్” లేటెస్ట్ వసూళ్లు ఇవే!


టాలీవుడ్ యంగ్ యాక్టర్ నార్నే నితిన్ ప్రధాన పాత్రలో, దర్శకుడు అంజి కే. మణిపుత్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఆయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మంచి హోల్డ్ ను కనబరుస్తోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 17 రోజుల్లో 16.40 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

ప్రేక్షకులను అలరిస్తున్న ఈ చిత్రంలో నయన్ సారిక ఫీమేల్ లీడ్ రోల్ లో నటించింది. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా, అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. రామ్ మిరియాల ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

Exit mobile version