సమీక్ష : “ఆయ్” – ఆకట్టుకునే కామెడీ ఎంటర్టైనర్

సమీక్ష : “ఆయ్” – ఆకట్టుకునే కామెడీ ఎంటర్టైనర్

Published on Aug 16, 2024 3:05 AM IST
Aay Movie Review in Telugu

విడుదల తేదీ : ఆగస్టు 15, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: నార్నె నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య తదితరులు

దర్శకుడు: అంజి కె మణిపుత్ర

నిర్మాతలు : బన్నీ వాస్, విద్యా కొప్పినీడి

సంగీత దర్శకుడు: రామ్ మిర్యాల,అజయ్ అరసాడ

సినిమాటోగ్రఫీ: సమీర్ కళ్యాణి

ఎడిట‌ర్ : కోదాటి పవన్ కళ్యాణ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

నార్నె నితిన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఆయ్’. ప్రముఖ బ్యానర్ GA2 పై బన్నీ వాస్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం.. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడం తో ప్రేక్షకుల్లో ఈ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి నేడు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఆయ్ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో ఈ రివ్యూ లో చూద్దాం.

కథ :

కార్తీక్, సుబ్బు, హరి చిన్నపటినుంచు మంచి స్నేహితులు. వర్క్ ఫ్రమ్ హోం కోసం ఊరికి వచ్చిన కార్తీక్ పల్లవి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడిని ఇష్ట పడుతుంది. అదే అమ్మాయిని సుబ్బు కూడా ప్రేమిస్తాడు. మరి పల్లవి ఎవరిని ప్రేమిస్తుంది..? వారి ప్రేమ పెళ్లిగా మారుతుందా? వారికి ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయి? వాటిని ఎలా పరిష్కరించారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఆయ్ సినిమాకి ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికీ దానిని ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది. సినిమాలోని ముఖ్య పాత్రలైన నార్నె నితిన్, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య లు తమ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. ముందు నుంచి చెబుతున్నట్లు గానే ఈ సినిమాలో కామెడీ కి పెద్దపీట వేశారు.

గోదావరి నేపథ్యంలో సాగే కథ కావడంతో సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఇక స్నేహితుల మధ్య సాగే సీన్స్ నవ్వులు పూయించాయి. అటు లవ్ స్టోరీ లో ఉండాల్సిన అంశాలు ఆకట్టుకున్నాయి. సర్ప్రైజ్ చేసే ట్విస్టులు ఉండటం ప్రేక్షకులను మెప్పించాయి.

సెకండ్ హాఫ్ లో కూడా కామెడీని కంటిన్యూ చేసిన తీరు బాగుంది. లవ్ స్టోరీ సక్సెస్ కావడానికి స్నేహితుల పాట్లు అక్కటుకుంటాయి. అయితే క్లైమాక్స్ లో వచ్చే ఆసక్తికరమైన ఎలివేషన్ ఈ సినిమాకే హైలైట్ అని చెప్పాలి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి రొటీన్ ప్లాట్ ని ఎంచుకోవడం మైనస్ అని చెప్పాలి. లవ్ ట్రాక్ ని కూడా కామెడీ డామినేట్ చేయడం కొంతవరకు ఆకట్టుకోదు. హీరో పాత్రని నితిన్ నార్నె ఇంకాస్త మెరుగ్గా చేసి ఉండాల్సింది.

హీరోయిన్ పాత్ర కూడా ఇంకాస్త బెటర్ గా డిజైన్ చేసి ఉండాల్సింది. పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని సీన్స్ వరకు లాజిక్ మిస్ అయిందని ఆడియన్స్ ఫీల్ అయ్యారు.

క్లైమాక్స్ లో చక్కటి ఎలివేషన్ ఉన్నా.. చాలా తొందరగా ముగించేసారని అనిపిస్తుంది. కొన్ని మిస్టేక్స్ ని సరిచేసుకుని ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది.

సాంకేతిక విభాగం :

దర్శకుడిగా అంజి చక్కటి ప్రతిభ ని కనబరిచాడు. సినిమాలో ఉండాల్సిన కమర్షియల్ అంశాలు మిస్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. యాక్టర్స్ దగ్గర్నుంచి మంచి పెర్ఫార్మన్స్ ను రాబట్టుకోవడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. గోదావరి అందాలను చక్కగా చూపెట్టారు. రామ్ మిర్యాల, అజయ్ అరసాడ మ్యూజిక్ అండ్ బీజీఎం పర్వాలేదు. ఎడిటింగ్ వర్క్ ఓకే అనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఆయ్ సినిమా చక్కటి కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుంది. అయితే సినిమాలోని సెకండ్ హాఫ్ లోని పేస్, మ్యూజిక్ ఆకట్టుకోకపోవడం ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేదు. ఈ వారాంతం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా ఆయ్.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు