నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ‘ఆయ్’

నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ‘ఆయ్’

Published on Sep 15, 2024 12:30 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో నార్నె నితిన్ నటించిన రీసెంట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఆయ్’ ఆగస్టు 15న బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను అంజి కె మణిపుత్ర డైరెక్ట్ చేయగా, GA2 ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేశారు.

ఈ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. పూర్తి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమా తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం అమితంగా ఆకట్టుకుంటోంది.

అంతేగాక, ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 4వ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించడంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు