Devara: ‘దేవర’లోని ‘ఆయుధపూజ’ సాంగ్ వచ్చేసింది.. కానీ!

Devara: ‘దేవర’లోని ‘ఆయుధపూజ’ సాంగ్ వచ్చేసింది.. కానీ!

Published on Sep 26, 2024 7:03 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ ‘దేవర’ మ్యానియాతో ఊగిపోతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ భారీ స్థాయిలో అమ్ముడు కావడంతో తొలిరోజు బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే వసూళ్లు రావడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ‘ఆయుధపూజ’ సాంగ్‌ను గతంలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్, కొన్ని కారణాల వల్ల దాన్ని వాయిదా వేశారు.

అయితే, దేవర మూవీ రిలీజ్‌కి మరికొద్ది గంటలు మాత్రమే ఉన్న తరుణంలో ఇప్పుడు సర్‌ప్రైజ్ చేస్తూ ‘ఆయుధపూజ’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అయితే, కేవలం ఆడియో సాంగ్ మాత్రమే మేకర్స్ రిలీజ్ చేశారు. దేవర పార్ట్-1 జ్యూక్‌బాక్స్‌లో ఈ ‘ఆయుధపూజ’ సాంగ్ ఉండటంతో అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తమ అభిమాన హీరో ఎన్టీఆర్ తుఫానుని రేపు థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని వారు ఫిక్స్ అవుతున్నారు.

‘దేవర’ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, అజయ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

‘దేవర’ జ్యూక్‌బాక్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు