‘స‌రిపోదా శ‌నివారం’లో ‘ఛాయాదేవి’గా అభిరామి.. పోస్ట‌ర్ రిలీజ్!

‘స‌రిపోదా శ‌నివారం’లో ‘ఛాయాదేవి’గా అభిరామి.. పోస్ట‌ర్ రిలీజ్!

Published on Jul 26, 2024 3:14 PM IST

టాలీవుడ్ లో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘స‌రిపోదా శ‌నివారం’ కూడా ఒక‌టి. నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న ఈ సినిమాను ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్ట‌ర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా నుంచి తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్.

ఈ సినిమాలో ఛాయాదేవి అనే పాత్ర‌లో న‌టి అభిరామి న‌టిస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఆమె పుట్టినరోజు సంద‌ర్భంగా ఓ పోస్ట‌ర్ ను కూడా రిలీజ్ చేశారు. హోమ్లీ పాత్ర‌లో అభిరామి ఈ సినిమాలో న‌టిస్తున్న‌ట్లు ఈ పోస్ట‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది.

ఇక ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక మోహ‌న్ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా విల‌క్ష‌ణ న‌టుడు ఎస్.జె.సూర్య విల‌న గా న‌టిస్తున్నాడు. జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై దాన‌య్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆగ‌స్టు 29న ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ సిద్ధ‌మ‌వుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు