‘అబ్‌కీ బార్ అర్జున్ సర్కార్’ స్లోగన్‌తో హిట్-3 ట్రైలర్ డేట్ రివీల్

న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ ప్రేక్షకుల్లో ఇప్పటికే సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

‘అబ్‌కీ బార్ అర్జున్ సర్కార్’ అంటూ సాగే ఈ పాట ఈ చిత్ర స్లోగన్ అని మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ పాటలో అర్జున్ సర్కార్ ఎలా కనిపిస్తాడో మనకు వివరించారు. నేరస్థులపై ఎలాంటి జాలి, దయ లేకుండా అర్జున్ సర్కార్ వారిని శిక్షించడమే ఈ సాంగ్ స్లోగన్ సారాంశం. నాని రూత్‌లెస్ ఆఫీసర్‌గా చాలా అగ్రెసివ్ మూడ్‌లో మనకు ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉండటంతో మూవీపై అంచనాలను మరింత పెంచేసింది.

ఈ లిరికల్ సాంగ్ చివర్లో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హిట్-3 ట్రైలర్ రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. ఏప్రిల్ 14న ఈ చిత్ర ట్రైలర్ రాబోతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మే 1న వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version