‘ఆచార్య’కి షెడ్యూల్స్ మధ్య గ్యాప్ ఉందట !

‘ఆచార్య’కి షెడ్యూల్స్ మధ్య గ్యాప్ ఉందట !

Published on Sep 27, 2020 8:02 PM IST

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ ను త్వరలో మొదలు పెడతారని వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం. అయితే కరోనా పరిస్థితుల్లో షూటింగ్ స్టార్ట్ చేయకపోవవడమే బెటర్ అనే అభిప్రాయంలో మెగాస్టార్ ఉన్నారట. కరోనా ప్రభావం తగ్గాక ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి, షెడ్యూల్స్ మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా షూటింగ్ ను పూర్తి చేయాలని మెగాస్టార్ కొరటాలకు సూచించినట్లు తెలుస్తోంది.

ఇక రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ చిత్రంలో కనిపిస్తారు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు లుక్ కూడా చేంజ్ చేశారు. యంగ్ గా కనిపించడానికి చాలా మేక్ ఓవర్ కూడా అయ్యారు. ఇక రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడు.

చరణ్ పాత్ర ఎమోషనల్ పాత్రగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మెగా సినిమా కావ‌డంతో ఈ సినిమా పై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు