కంగారుపడుతున్న ‘ఆచార్య’ టీమ్

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న కొత్త చిత్రం ‘ఆచార్య’. షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే పూర్తికావాల్సిన చిత్రం కరోనా లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైంది. దీంతో విడుదల కూడ చాలా వెనక్కి వెళ్ళింది. కరోనా ఉధృతి మెల్లగా తగ్గడంతో వేగం పుంజుకుంది. మళ్ళీ కేసులు పెరుగుతుండటంతో పలుచోట్ల పాక్షిక లాక్ డౌన్ విధిస్తున్నారు. మీడియాలో మాత్రం త్వరలో మరొక లాక్ డౌన్ విధించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. దీంతో సినీ వర్గాల్లో కంగారు మొదలైంది. లాక్ డౌన్ అంటే ముందుగా ఎఫెక్ట్ అయ్యేది సినిమా పరిశ్రమే.

షూటింగ్స్ ఉన్నపళంగా ఆపేయాల్సి ఉంటుంది. అందుకే నిర్మాణ దశలో ఉన్న పెద్ద సినిమాలు త్వరపడుతున్నాయి. ముఖ్యంగా ‘ఆచార్య’ టీమ్ స్పీడ్ పెంచింది. ఒకవేళ మళ్ళీ లాక్ డౌన్ పడితే కొద్దిపాటి షూటింగ్ బ్యాలన్స్ పడి సినిమా ఆగిపోతుంది. అందుకే త్వరగా మిగిలి ఉన్న భాగాన్ని కూడ పూర్తిచేసేస్తే మంచిదని కొరటాల శివ భావిస్తున్నారట. చిరు కూడ బ్రేక్ లేకుండా షూట్ చేయడానికి సహకరిస్తుండటం కొరటాలకు బాగా కలిసొస్తోంది. అనుకున్న తేదీ కంటే ముందే పనులు పూర్తయ్యేలా ఉన్నాయట. మే 13వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

Exit mobile version