హిందీలో “గేమ్ ఛేంజర్” కి “ఆచార్య” విలన్ ట్విస్ట్!

హిందీలో “గేమ్ ఛేంజర్” కి “ఆచార్య” విలన్ ట్విస్ట్!

Published on Jan 3, 2025 8:05 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే కియారా అద్వానీ ఇంకా అంజలి హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “గేమ్ ఛేంజర్”. సాలిడ్ హైప్ ని సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా పాన్ ఇండియా లెవెల్లో గేమ్ ఛేంజర్ పట్ల ఇపుడు మరింత బజ్ మొదలైంది.

అలాగే హిందీలో కూడా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుండగా ఇపుడు హిందీ మార్కెట్ లో గేమ్ ఛేంజర్ కి ట్విస్ట్ తగిలింది అని చెప్పాలి. ప్రస్తుతానికి జనవరి 10 కి ఎలాంటి నోటెడ్ సినిమాల పోటీ లేదు కానీ ఇపుడు ప్రముఖ నటుడు విలన్ సోనూసూద్ నటించిన భారీ చిత్రం “ఫతేహ్” ని అనౌన్స్ చేయడం ట్విస్ట్ గా మారింది. అయితే సోనూ సూద్ కి హిందీలో మంచి ఫేమ్ ఉంది. పైగా ఫతేహ్ ని ఒక భారీ యాక్షన్ సినిమాగా తానే దర్శకత్వం వహిస్తుండడం విశేషం. మరి ఈ సినిమా గేమ్ ఛేంజర్ కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు