ఖమ్మం ప్రాంతంలో ఆచార్య షూటింగ్ !

ఖమ్మం ప్రాంతంలో ఆచార్య షూటింగ్ !

Published on Mar 7, 2021 6:21 PM IST

కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ రోజు ఖమ్మంలోని ఇల్లెండులో ప్రారంభమైంది. కాగా ఈ షెడ్యూల్ మార్చి 15 వరకు కొనసాగుతుంది. ఇల్లెండులోని జెకె మైన్స్‌లోని గనుల వద్ద ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. దాంతో వందలాది మంది అభిమానులు షూటింగ్ ప్రదేశానికి చేరుకున్నారు.

ఇక జనాన్ని నియంత్రించడానికి అదనపు పోలీసు బలగాలను నియమించారు. ప్రస్తుతం, కఠినమైన పోలీసు జాగ్రత్తల మధ్య షూటింగ్ జరుగుతోంది. రామ్ చరణ్ కూడా కొన్ని రోజుల్లో ఈ షెడ్యూల్‌లో జాయిన్ అవ్వనున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా తీసుకున్నారు.

ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట. మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు