సరిపోదా శనివారం’ పవర్‌ఫుల్ యాక్షన్ మేకింగ్ వీడియో

సరిపోదా శనివారం’ పవర్‌ఫుల్ యాక్షన్ మేకింగ్ వీడియో

Published on Sep 17, 2024 10:11 PM IST

న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా మూవీ ‘సరిపోదా శనివారం’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది.

ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్‌కి ప్రేక్షకులు బాగా ఇంప్రెస్ అయ్యారు. భారీ విజయం సాధించిన ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా యాక్షన్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో చిత్ర యూనిట్ ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ కోసం ఎంతలా కష్టపడ్డారో మనకు కనిపిస్తుంది.

‘సరిపోదా శనివారం’ మూవీలో నాని సరసన అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, తమిళ వెర్సటైల్ యాక్టర్ ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో సాలిడ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతం అందించగా, డివివి దానయ్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు