స్టార్ తమిళ హీరో నెక్స్ట్ మూవీ లో టాలీవుడ్ యాక్టర్ అజయ్!

స్టార్ తమిళ హీరో నెక్స్ట్ మూవీ లో టాలీవుడ్ యాక్టర్ అజయ్!

Published on Jul 27, 2022 5:07 PM IST


యాక్టర్ అజయ్ తెలుగు చిత్ర సీమలో అత్యంత ప్రతిభావంతులైన నటులలో ఒకరు మరియు ఇప్పటికి పదిహేనేళ్లకు పైగా ఇండస్ట్రీ లో ఉన్నారు. అతను తమిళ బిగ్గీని కైవసం చేసుకోవడంతో ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. తాజా అప్‌డేట్ ప్రకారం, హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న థల అజిత్ 61వ చిత్రాన్ని అజయ్ దక్కించుకున్నాడు.

అజయ్ కొత్త షెడ్యూల్ కోసం పూణేలో టీంతో జాయిన్ అవుతాడు. అజయ్ ఈ చిత్రం లో కీలక పాత్రలో కనిపించనున్నాడు. థల అజిత్‌తో షూటింగ్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజిత్ నెరిసిన జుట్టుతో కనిపించనున్నారు. ఈ సినిమాలో మంజు వారియర్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. అజిత్ గత చిత్రం వలిమై లో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ నటించగా, ఇప్పుడు అజయ్ ఆ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు