నటుడు అజయ్ దాదాపు అందరు స్థార్ హీరోల సినిమాల్లోనూ నటించేశారు. ప్రతినాయకుడి పాత్రలతో పాటు సపోర్టింగ్ రోల్స్, పాజిటివ్ రోల్స్ చాలానే చేసి తనలో విలనిజంతో పాటు కామెడీ యాంగిల్, ఎమోషన్ పండించగల సత్తా ఉన్నాయని నిరూపించుకున్నాడు. ఇలా సహా నటుడిగా దాదాపు అన్ని తరహా పాత్రలు చేసిన ఆయన ఇంకేదో కొత్తగా ట్రై చేయడానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తున్నారు.
ఎందుకంటే కొన్ని నెలల నుండి తీవ్రంగా వర్కవుట్స్ చేస్తున్న ఆయన సిక్స్ ప్యాక్ లుక్ కోసం ట్రై చేస్తున్నారు. దాదాపు ఆ లుక్ రాబట్టేశారు. గతంలో కంటే స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ ప్రిపరేషన్ మొత్తం చూస్తుంటే ఆయన ఏదో పెద్ద ప్రాజెక్ట్ కోసమే రెడీ అవుతున్నారని అనిపిస్తోంది. మరి ఆ ప్రాజెక్ట్ ఏమిటనేది తెలియాలంటే ఆయనే స్వయంగా స్పందించాలి.