టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన వారసుడు ఆకాష్ పూరిని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత పలు సినిమల్లో నటించిన ఆకాష్ పూరి హీరోగా కూడా మారాడు. ఆకాష్ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి.
అయితే, తాజాగా తన పేరును ఆకాష్ పూరి నుంచి ఆకాష్ జగన్నాధ్ గా మార్చుకుంటున్నట్లు ఈ యంగ్ హీరో ప్రకటించాడు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా ఆకాష్ ఇలా తన పేరును మారుస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. తండ్రి పేరు కలిసేలా ఆకాష్ పూరి ఉండగా, ఇప్పుడు కొత్త పేరులోనూ తండ్రి పేరు జగన్నాధ్ కంటిన్యూ చేస్తున్నాడు.
ఇక ఈ హీరో సినిమాల పరంగా నటించిన చివరి చిత్రం ‘చోర్ బజార్’ బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. తన నెక్ట్స్ ప్రాజెక్టు కోసం పలు కథలు వింటున్నాడట ఈ యంగ్ హీరో.